Friday 25 November 2016

ట్రైలర్ టాక్: ధృవ.. లవ్ యు స్వీట్ హార్ట్ - ప్రభంజనం

ఇప్పుడు అందరూ కూడా త్వరలో రానున్న మెగా మూవీ ''ధృవ'' ట్రైలర్ గురించే వెయిట్ చేస్తున్నారు. తమిళ మూవీ థని ఒరువన్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్న రామ్ చరణ్.. ఇంతకీ ట్రైలర్లో ఏం చూపించాడు? పదండి చూద్దాం. 

ఒక్కొక్క చిన్న క్రిమినల్ తో తలపడే బదులు.. ఏ క్రిమినల్ ను అయితే అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో.. అతడే నా టార్గెట్ అంటూ పని మొదలెట్టేశాడు ఐపిఎస్ ఆఫీసర్ ధృవ. అయితే చాలామందిని రాజకీయ నాయకులను నడిపించే ఆ ఆఫీసర్ ఎవరో కాదు.. బిజినెస్ మ్యాన్ సిద్దార్ద్ అభిమన్యు.. ఉరఫ్ మన అరవింద్ స్వామి. సినిమా మేకింగ్ అంతా స్టయిలిష్ అండ్ క్లాస్ గా అదిరిపోయిందంతే. రామ్ చరణ్ కూడా ఒక ప్రక్కన పోలీస్ ఆఫీసర్ గా కండలు చూపిస్తూ..మరో ప్రక్కన ఇంటెలిజెంట్ ఫోలీస్ ఆఫీసర్ గా తన ఎక్స్ ప్రెషన్లతో అదరగొట్టాడు. ఒక్క ఫ్రేములో మెరిసినా.. హానెస్ట్ ప్రియురాలిలా రకుల్ ప్రీత్ కూడా ఎట్రాక్ట్ చేసింది. ట్రైలర్ చివర్లో అరవింద్ స్వామి చెప్పినట్లు.. ''లవ్ యు స్వీట్ హార్ట్'' అన్నంత స్వీటుగా ఉంది ధృవ ట్రైలర్. సైలెంట్ గా వచ్చి చరణ్ భారీగానే ప్రభంజనం సృష్టించే ప్రణాళికలు వేసినట్లున్నాడు. 

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్ గురించి చెప్పే పనేలేదు. మనోడు తమిళ సినిమాతో ఎక్కడ సంబంధం లేకుండా ప్రతి ఫ్రేమునా డిఫరెంటుగా తీర్చిదిద్దాడు. కెమెరా మ్యాన్ పి.ఎస్.వినోద్ పనితనం కూడా అదిరింది. అయితే హిప్ హాప్ తమిళ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కాస్త వీక్ అనే చెప్పాలి. రెండోసారి విన్నప్పుడే ఎక్కుతోంది. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ యాజూజువల్ అదిరిపోయాయ్. అది సంగతి. 

Thursday 24 November 2016

యంగ్ చిరు.. ఖుషీఖుషీగా ఉన్నారట

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఖైదీ నెంబర్ 150ని ఫినిష్ చేసే పనుల్లో ఉన్నారు. రీసెంట్ గా యూరోప్ వెళ్లి క్రొయేషియో-స్లొవేనియాల్లో పాటలు కూడా పాడుకుని వచ్చారు. వీటిలో కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సాంగ్ కూడా ఉందిట. 

అయితే.. తన ఏజ్ లో సగం మాత్రమే ఉన్న కాజల్ తో రొమాన్స్ అంటే.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే పాయింట్ కంటే.. అసలు పెయిర్ ఎలా ఉంటుందో అని మథన పడ్డారట చిరు. పైగా రామ్ చరణ్-కాజల్ అగర్వాల్ ల జంట మూడు నాలుగు సినిమాల్లో మెప్పించిన హిస్టరీ ఉంది. మరిప్పుడు తనతో ఎలా ఉంటుందో.. పైగా రొమాంటిక్ సాంగ్స్ లో తేడా వస్తే ఎలా అని ఫీలయిన చిరుకు.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నుంచి అభయం వచ్చిందట. గతంలో రజినీకాంత్-ఐశ్వర్యారాయ్ లతో రోబో తీశానని.. పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేస్తానని చెప్పిన రత్నవేలు.. చెప్పినట్లుగా సూపర్బ్ యాంగిల్స్ నుంచి షూట్ చేశాడట. 

ఈ పాటలకు సంబంధించిన ఎడిటెడ్ ఫీడ్ చూసుకుని చిరు చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. తామిద్దరి మధ్య ఉన్న 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ అంతరాన్ని దాదాపు కనిపించకుండా తీసిన రత్నవేలును అభినందించారట చిరంజీవి. దీనికి డీఐ వర్క్ కూడా తోడయ్యాక.. తాను మరింత యంగ్ గా ఆన్ స్క్రీన్ పై కనిపించడం ఖాయమని అర్ధమైన చిరు.. శాటిస్ఫై అయ్యారట. 

పవన్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటా

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు కోలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఉంది. ఇతడిని తెలుగులోకి తెచ్చేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ.. నితిన్-సమంత నటించిన అఆ ల కోసం తీసుకున్నా.. తర్వాత తప్పుకున్నాడీ కంపోజర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సైన్ చేసిన అనిరుధ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటానని అంటున్నాడు. 

"పవన్ మూవీకి ఇంకా కంపోజింగ్ ప్రారంభించలేదు. అయితే.. నాకు స్టోరీతో పాటు సినిమా గురించి పూర్తి ఐడియా ఉంది. త్వరలో వర్క్ ప్రారంభించనున్నాం. త్రివిక్రమ్ గారితో మాట్లాడి.. ప్రమోషనల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండేలా జాగ్రత్త పడతాను" అని చెప్పాడు అనిరుధ్. 

వైదిస్ కొలవెరి డీ పాటతో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిపోయిన  అనిరుధ్.. తెలుగులో అరంగేట్రం చేసేందుకు చాలానే టైమ్ తీసుకున్నా.. పవర్ స్టార్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించడాన్ని పక్కాగా ఉపయోగించుకునేందుకు సిద్ధమైపోతున్నాడు. 

ఎన్టీఆర్‌కి ఏకు మేకవుతున్న బన్నీ

ఏ దర్శకుడి కథనైనా ఓకే చేయకుండా ఎన్టీఆర్‌ తాత్సారం చేస్తే వెంటనే ఆ కథని అల్లు అర్జున్‌ ఎగరేసుకు పోతున్నాడు. ఎన్టీఆర్‌ ఈ మధ్య క్లాస్‌ అప్పీల్‌ వున్న కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అల్లు అర్జున్‌ మాత్రం మాస్‌ ఇమేజ్‌ పెంచుకునే దానిపై ఫోకస్‌ పెడుతున్నాడు. ఎన్టీఆర్‌ తో సినిమా అంటే దర్శకులు సహజంగానే మాస్‌ కథలు రాసుకుంటారు. అయితే ఆ కథలు చేయాలా వద్దా అని ఎన్టీఆర్‌ డైలెమాలో వుండగా వాటిని బన్నీ తన్నుకుపోతున్నాడు. లింగుస్వామి ముందుగా ఎన్టీఆర్‌ చుట్టూనే కథ పట్టుకుని తిరిగాడు. అతడిని ఎన్టీఆర్‌ ఎంటర్‌టైన్‌ చేయలేదు. తర్వాత బన్నీ చుట్టూ తిరిగిన లింగుస్వామికి అక్కడ్నుంచీ గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. 

బన్నీ ఎలాగో లింగుస్వామితో చేయడం లేదని, అతనితోనే సినిమా చేద్దామంటూ ఎన్టీఆర్‌ పావులు కదిపాడు. ఈ సంగతి తెలుసుకోగానే లింగుస్వామితో సినిమా ఘనంగా లాంఛ్‌ చేసాడు అల్లు అర్జున్‌. ఎప్పుడు చేసేదీ తేల్చకుండా లింగుస్వామిని లాక్‌ చేసి పారేసాడు. ఈలోగా ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేసిన వక్కంతం వంశీ కథని విని అతడికి వెంటనే అవకాశమిచ్చాడు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి కథని ఎన్టీఆర్‌ ఓకే చేయకుండా తిప్పించుకుంటున్నాడు. దీంతో అతడిని కూడా బన్నీ కాంటాక్ట్‌ చేసినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలా తనని చిత్రంగా వేధిస్తోన్న బన్నీ గురించి ఎన్టీఆర్‌ తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకుంటున్నాడట. తన దగ్గరకి వచ్చే దర్శకుల గురించిన న్యూస్‌ బయటకి పొక్కకుండా చూసుకోమని పీఆర్‌ టీమ్‌కి స్ట్రిక్ట్‌గా చెప్పాడట. 

కోడలి చేతి మీదుగా మెగా వేడుక

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కోసం టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న మూవీ కావడంతో.. అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మూవీని అందించేందుకు దర్శకుడు వివి వినాయక్ కష్టపడుతుంటే.. మూవీపై బజ్ అంతకంటే ఎక్కువగా క్రియేట్ అయిపోతోంది. దీన్ని రీచ్ అయేందుకు ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. 

ఇప్పుడు మెగా మూవీకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకను తాను హ్యాండిల్ చేస్తానని రామ్ చరణ్ భార్య ఉపాసన చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ఏర్పాట్లు ఆమె సలహాలు సూచనల మేరకే జరుగుతున్నాయట. గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ లెవెల్ లో ఈ ఫంక్షన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. గత పదేళ్లలో ఏ ఆడియో వేడక జరగనంత అట్టహాసంగా ఖైదీ పాటల పండుగను నిర్వహించనున్నారని టాక్. దాదాపు ఇండస్ట్రీలోని అందరు దిగ్గజాలతో పాటు.. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు మాట తీసుకున్నారట. మరోవైపు చిరుతో గతంలో నటించిన హీరోయిన్స్ అందరినీ ఖైదీ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద ఇండస్ట్రీ ఇప్పటివరకూ చూడని గ్రాండ్ ఫంక్షన్ ని.. మెగా డాటర్ ఇన్ లా చూపించబోతోందని టాక్. 

Wednesday 23 November 2016

80ల్లోకి వెళ్తున్న సుకుమార్-చరణ్

1 నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల తర్వాత సుకుమార్ సినిమా అనగానే అందరూ ఒక అల్ట్రా మోడర్న్ మూవీనే ఊహించారు. రామ్ చరణ్ తో సుక్కు చేయబోయే సినిమాకు 'ఫార్ములా ఎక్స్' అంటూ ఒక మోడర్న్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని కూడా అన్నారు. ఐతే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేస్తూ.. తాను చేయబోయేది ఒక విలేజ్ స్టోరీ అంటూ పెద్ద షాకే ఇచ్చాడు సుకుమార్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆశ్చర్యకర అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మూడు దశాబ్దాల కిందటి బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. 80ల్లో నడిచే ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట సుకుమార్.

సుక్కు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. '1 నేనొక్కడినే' నుంచి అప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా అడుగులేస్తున్న సుకుమార్.. ఇప్పుడు మరో కొత్త దారిలోకి వస్తున్నాడు. సుకుమార్ ఇంతకుముందు సినిమాలకు.. ఇప్పుడు చేస్తున్న దానికి అసలు పోలికే ఉండదని సమాచారం. స్మార్ట్ ఫోన్లు.. ఇంటర్నెట్లు లేని కాలంలో ప్రేమ ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ అని సమాచారం. ఐతే సుకుమార్ స్టయిల్లో కొంచెం టిపికల్ గానూ సాగుతుందట. ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరో ఇంకా ఫిక్సవలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదికి వెళ్తుంది.

కొత్త కాంబో.. బన్నీ-వక్కంతం-లగడపాటి

గత కొన్నేళ్ల నుంచి ఒక సినిమా చేస్తుండగా.. ఇంకో కొత్త సినిమా గురించి ఆలోచించట్లేదు అల్లు అర్జున్. ఐతే ఈ మధ్య పాలసీ మార్చేశాడు. హరీష్ శంకర్ సినిమా మొదలయ్యే ముందే తమిళ దర్శకుడు లింగుస్వామితో బైలింగ్వల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోకముందే బన్నీ మరో సినిమా కూడా ఓకే అయిపోయినట్లు సమాచారం. 

కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే వక్కంతం వంశీ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ అల్లు అర్జున్ తోనే ఉండబోతోంది. ఈ సినిమా నిర్మాత ఎవరో కూడా తేలిపోయింది. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. మరో విశేషం ఏంటంటే ఇందులో నాగబాబు నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నాడట. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

ఈ ప్రాజెక్టు గురించి ఒక సీనియర్ పీఆర్వో ట్విట్టర్లో సమాచారం ఇచ్చారు. ఐతే కాసేపటి తర్వాత ఆయన ఆ ట్వీట్ ను డెలీట్ చేశారు. నిర్మాతల విషయంలో కొంత డైలమా ఉందని తెలుస్తోంది. ఐతే బన్నీ-వక్కంతం కాంబినేషన్లో సినిమా మాత్రం ఖాయం అని తెలుస్తోంది. రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం దర్శకుడిగా మారాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా వర్కవుట్ కాకపోవడంతో బన్నీకి కథ వినిపించి మెప్పించాడు వక్కంతం.

Monday 21 November 2016

సానియా పార్టీలో చెర్రీ షర్ట్ విప్పేశాడా??

ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న హాటెస్ట్ గాసిప్ ఏంటంటే.. మొన్న జరిగిన సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా వెడ్డింగ్ పార్టీలో జరిగిన కొన్ని క్రేజీ విషయాల గురించే. ఆ ఈవెంట్ కు టాలీవుడ్ నుండి రామ్ చరణ్ అండ్ ఉపాసన.. అలాగే బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్.. ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరందరూ కూడా తెల్లారే వరకు అక్కడే పార్టీ చేసుకున్నారట. 

ఈ సందర్భంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ లో.. సల్మాన్ ఖాన్ ఎలాగో ఈజీగా షర్ట్ విప్పేసి బాడీని చూపించేస్తాడు కాబట్టి.. అదే పని చేశాడంట. అయితే మనోడు షర్ట్ విప్పిన వెంటనే.. ఇప్పుడు నువ్వు కూడా షర్ట్ విప్పేసి లోపల ఏ ప్యాక్ ఉందో అందరికీ చూపించు అంటూ చరణ్ ను టీజ్ చేయడం స్టార్ట్ చేశాడట. నిజానికి సల్మాన్ ఖాన్ ఫిట్ గా ఉంటాడు కాని.. పొట్ట దగ్గర ఎటువంటి ప్యాకులూ లేవు. మనోడు షర్ట్ విప్పే సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ లో ప్యాక్ తగిలిస్తారు అంతే. మరి చరణ్ గురించి కూడా అలాగే అనుకున్నాడేమో. ఇక ఫ్యామిలీ ఫ్రెండ్ సల్మాన్ అడిగాడు కాబట్టి వెంటనే షర్టు విప్పేశాడట చరణ్. లోపల చూస్తే అందరూ షాక్. 

ధృవ సినిమా కోసం ఇప్పుడు మరోసారి లైట్ గా సిక్స్ ప్యాక్ తెప్పించాడట రామ్ చరణ్. ఇదే విషయాన్ని గమనించిన సల్మాన్ అవాక్కైపోయి వెంటనే షర్టు వేసేసుకో నాయనో అంటూ చెప్పడం మొదలెట్టాడు. మొత్తానికి సానియా మీర్జా పార్టీలో అసలు వీరి అల్లరికి అంతే లేకుండా పోయిందిగా. 

Sunday 20 November 2016

మెగా కబురు.. ‘ధృవ’ రిలీజ్ డేట్ కన్ఫమ్

మెగా అభిమానుల నిరీక్షణ ఫలించబోతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ‘ధృవ’ సినిమా కోసం ఇంకెంతో కాలం మెగా ఫ్యాన్స్ నిరీక్షించాల్సినపని లేదు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. డిసెంబరు 2 నుంచి ‘ధృవ’ను వాయిదా వేసిన నిర్మాత అల్లు అరవింద్ ఆ తర్వాతి వారానికే సినిమాను కన్ఫమ్ చేశాడు. డిసెంబరు 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సౌత్ ఇండియాలో రాబోతున్న స్టార్ సినిమా ఇదే. ఈ నిర్ణయం వచ్చాక తొలి వారంలో విడుదలైన సినిమాలకు పంచ్ బాగానే పడింది. ఇటు తెలుగులో.. అటు తమిళంలో వచ్చిన సినిమాలన్నీ దెబ్బ తిన్నాయి. చాలా సినిమాలు వాయిదా కూడా పడ్డాయి.

మళ్లీ మామూలు పరిస్థితులు రావడానికి ఎంత సమయం పడుతుందో అన్న ఆందోళనతో ‘ధృవ’ను జనవరికి వాయిదా వేసేస్తున్నట్లు జరిగిన ప్రచారం మెగా అభిమానుల్లో కలకలం రేపింది. ఐతే డిసెంబర్లోనే రిలీజ్ అని నొక్కి వక్కాణించిన అరవింద్.. ఇప్పుడు 9న సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించాడు. నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతుండటం.. ఈ వీకెండ్లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కలెక్షన్లు బాగుండటంతో ‘ధృవ’ ధైర్యం చేసి 9నే వచ్చేస్తున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘ధృవ’కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే మార్కెట్ లోకి నేరుగా విడుదలైన ‘ధృవ’ పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. చరణ్ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిందీ సినిమాలో.

పవన్.. రావడం లేటైంది అంతే!!

ఒక్కోసారి రావడం లేటవుతుంది కాని.. రావడం మాత్రం పక్కా.. అంటూ డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన రియల్ లైఫ్ లో అన్ని విషయాల్లోనూ అదే నిజం చేస్తున్నాడు. ఇండస్ర్టీ హిట్ కొట్టడంలోనైనా.. కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టడంలోనైనా.. రావడం లేటైంది కాని.. రావడం మాత్రం పక్కా అన్నచందానే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే కోవలోకి మరో విషయం వచ్చిపడింది. 

అప్పట్లో యాంకర్ సుమకు గబ్బర్ సింగ్ రిలీజ్ టైములో ఒక ఇంటర్యూ ఇచ్చిన పవర్ స్టార్.. అసలు ఆ ట్విట్టర్ లో ఏముంది చెప్పండి.. రోజూ టిఫిన్ తిన్నా భోజనం చేశా అంటూ అప్డేట్లు పెట్టడం తప్పించి.. అంటూ కామెంట్ చేశాడు. కాని అనతికాలంలోనే సోషల్ మీడియా అనేది ఒక ప్రాథమిక మాద్యమంలా ఎదిగిపోవడంతో పవన్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుని ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నాడు.

సాధారణంగానే అసలు పవన్ చాలా తక్కువగా మాట్లాడతాడు. తన ట్వీట్లు కూడా కేవలం తన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం తను అడగాల్సిన ప్రశ్నలనే ఎక్కువగా సంధిస్తుంటాడు. అందుకే ఆయన 1 మిలియన్ ఫాలోవర్స్ అనే విషయాన్ని కూడా ప్రచారం చేయడు. కాకపోతే అభిమాన లోకం ఊరుకుంటుందా చెప్పండి. వారు మాత్రం యథావిథిగా పండగ చేసుకుంటున్నారంతే.

Wednesday 16 November 2016

ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే

సినిమావాళ్లు చాలా కమర్షియల్ గా ఉంటారని చెబుతుంటారు. పని ఉందా పూసుకుంటారని.. పని పూర్తి అయ్యాక ఎవరో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తారని.. అది వారి తప్పు కాదని.. వారున్న ఇండస్ట్రీ అలాంటిదని చెబుతుంటారు. ఇక్కడ తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా వ్యవహరిస్తారని.. పైకి ఎంత పూసుకున్నా.. లెక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా మొండిగా ఉంటారని ఏ మాత్రం తగ్గరన్నట్లు చెబుతుంటారు. అయితే.. ఇలాంటి మాటలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

మిగిలిన హీరోలకు చాలా భిన్నమని కొందరు.. మంచితనానికి నిలువెత్తు రూపంగా మరికొందరు వర్ణిస్తే.. ఎప్పుడేం చేస్తాడో తెలీదని.. టెంపర్ మెంట్ చాలా ఎక్కువని.. మెంటలోడని మరికొందరు ఆయనపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరింత మాట అంటున్నారు కదా.. దానికేమైనా ఆధారం ఉందా? అంటే.. మళ్లీ మాట్లాడని పరిస్థితి.

ఇదంతా ఒక కోణమైతే.. సాయం ఎవరికి వచ్చినా సరే.. సహాయం చేసేందుకు పెద్ద మనసుతో పవన్ ముందుంటారని ఆయన్ను అభిమానించని వారుసైతం ఒప్పుకునే మాట. రాజకీయంగా.. సినిమాల పరంగా ఆయన్ను వ్యతిరేకించే వారు మాత్రం వ్యక్తిగతంగా పవన్ ను విమర్శించేందుకు ఇష్టపడరు. ఆయన చేసే గుప్త దానాల గురించి కొందరు అనుకోని రీతిలో ఓపెన్ అయిపోవటం.. పవన్ లో ఇలాంటి మనిషి దాగి ఉన్నాడా? అనిపించక మానదు. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే గుణం పవన్ లో చిన్నతనం నుంచి ఉందని.. ఆ మాటకు వస్తే.. సినిమాల్లోకి రాక ముందే ఆయనలో ఆ లక్షణం ఉందని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓనమాలు నేర్పించే స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు హీరోల గురించి చెప్పుకొచ్చారు. దాదాపు 95 మంది హీరోల్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన.. పవన్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన దగ్గర యాక్టింగ్ లో శిక్షణ పొందిన పవన్.. తర్వాత కూడా టచ్ లో ఉండేవాడని.. చాలా స్నేహంగా ఉండేవాడని.. హైదరాబాద్ రావాలని కోరేవాడని చెప్పారు.

‘‘ఓ రోజు ముంబయి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ రమ్మన్నాడు. చెల్లెలి పెళ్లి ఉందని కుదరదని చెప్పా. అంతే.. నా ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి కలిశాడు. ఓ చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లి చూస్తే.. అందులో రూ.50వేలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చి మరో రూ.50వేలు ఇచ్చాడు. అడగకుండానే ఇంత సాయం చేశాడు. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా.. అప్పట్లోనే అంత పెద్ద సాయం చేశాడు. సేవాగుణం పవన్ సహజ లక్షణం’’ అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మనుషులు చాలా కమర్షియల్ గా ఉంటారని చెప్పే ఉదంతాలకు పవన్ కల్యాణ్ మినహాయింపుగా చెప్పక తప్పదు.