Wednesday 23 November 2016

80ల్లోకి వెళ్తున్న సుకుమార్-చరణ్

1 నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల తర్వాత సుకుమార్ సినిమా అనగానే అందరూ ఒక అల్ట్రా మోడర్న్ మూవీనే ఊహించారు. రామ్ చరణ్ తో సుక్కు చేయబోయే సినిమాకు 'ఫార్ములా ఎక్స్' అంటూ ఒక మోడర్న్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అని కూడా అన్నారు. ఐతే ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించేస్తూ.. తాను చేయబోయేది ఒక విలేజ్ స్టోరీ అంటూ పెద్ద షాకే ఇచ్చాడు సుకుమార్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆశ్చర్యకర అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మూడు దశాబ్దాల కిందటి బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. 80ల్లో నడిచే ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట సుకుమార్.

సుక్కు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. '1 నేనొక్కడినే' నుంచి అప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా అడుగులేస్తున్న సుకుమార్.. ఇప్పుడు మరో కొత్త దారిలోకి వస్తున్నాడు. సుకుమార్ ఇంతకుముందు సినిమాలకు.. ఇప్పుడు చేస్తున్న దానికి అసలు పోలికే ఉండదని సమాచారం. స్మార్ట్ ఫోన్లు.. ఇంటర్నెట్లు లేని కాలంలో ప్రేమ ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ అని సమాచారం. ఐతే సుకుమార్ స్టయిల్లో కొంచెం టిపికల్ గానూ సాగుతుందట. ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరో ఇంకా ఫిక్సవలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదికి వెళ్తుంది.

No comments:

Post a Comment