Sunday 20 November 2016

పవన్.. రావడం లేటైంది అంతే!!

ఒక్కోసారి రావడం లేటవుతుంది కాని.. రావడం మాత్రం పక్కా.. అంటూ డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన రియల్ లైఫ్ లో అన్ని విషయాల్లోనూ అదే నిజం చేస్తున్నాడు. ఇండస్ర్టీ హిట్ కొట్టడంలోనైనా.. కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టడంలోనైనా.. రావడం లేటైంది కాని.. రావడం మాత్రం పక్కా అన్నచందానే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే కోవలోకి మరో విషయం వచ్చిపడింది. 

అప్పట్లో యాంకర్ సుమకు గబ్బర్ సింగ్ రిలీజ్ టైములో ఒక ఇంటర్యూ ఇచ్చిన పవర్ స్టార్.. అసలు ఆ ట్విట్టర్ లో ఏముంది చెప్పండి.. రోజూ టిఫిన్ తిన్నా భోజనం చేశా అంటూ అప్డేట్లు పెట్టడం తప్పించి.. అంటూ కామెంట్ చేశాడు. కాని అనతికాలంలోనే సోషల్ మీడియా అనేది ఒక ప్రాథమిక మాద్యమంలా ఎదిగిపోవడంతో పవన్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకుని ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నాడు.

సాధారణంగానే అసలు పవన్ చాలా తక్కువగా మాట్లాడతాడు. తన ట్వీట్లు కూడా కేవలం తన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం తను అడగాల్సిన ప్రశ్నలనే ఎక్కువగా సంధిస్తుంటాడు. అందుకే ఆయన 1 మిలియన్ ఫాలోవర్స్ అనే విషయాన్ని కూడా ప్రచారం చేయడు. కాకపోతే అభిమాన లోకం ఊరుకుంటుందా చెప్పండి. వారు మాత్రం యథావిథిగా పండగ చేసుకుంటున్నారంతే.

No comments:

Post a Comment