Wednesday 23 November 2016

కొత్త కాంబో.. బన్నీ-వక్కంతం-లగడపాటి

గత కొన్నేళ్ల నుంచి ఒక సినిమా చేస్తుండగా.. ఇంకో కొత్త సినిమా గురించి ఆలోచించట్లేదు అల్లు అర్జున్. ఐతే ఈ మధ్య పాలసీ మార్చేశాడు. హరీష్ శంకర్ సినిమా మొదలయ్యే ముందే తమిళ దర్శకుడు లింగుస్వామితో బైలింగ్వల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా ఇంకా ప్రారంభోత్సవం జరుపుకోకముందే బన్నీ మరో సినిమా కూడా ఓకే అయిపోయినట్లు సమాచారం. 

కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లే వక్కంతం వంశీ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ అల్లు అర్జున్ తోనే ఉండబోతోంది. ఈ సినిమా నిర్మాత ఎవరో కూడా తేలిపోయింది. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. మరో విశేషం ఏంటంటే ఇందులో నాగబాబు నిర్మాణ భాగస్వామిగా ఉండబోతున్నాడట. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

ఈ ప్రాజెక్టు గురించి ఒక సీనియర్ పీఆర్వో ట్విట్టర్లో సమాచారం ఇచ్చారు. ఐతే కాసేపటి తర్వాత ఆయన ఆ ట్వీట్ ను డెలీట్ చేశారు. నిర్మాతల విషయంలో కొంత డైలమా ఉందని తెలుస్తోంది. ఐతే బన్నీ-వక్కంతం కాంబినేషన్లో సినిమా మాత్రం ఖాయం అని తెలుస్తోంది. రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం దర్శకుడిగా మారాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా వర్కవుట్ కాకపోవడంతో బన్నీకి కథ వినిపించి మెప్పించాడు వక్కంతం.

No comments:

Post a Comment