Thursday 24 November 2016

కోడలి చేతి మీదుగా మెగా వేడుక

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కోసం టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న మూవీ కావడంతో.. అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే మూవీని అందించేందుకు దర్శకుడు వివి వినాయక్ కష్టపడుతుంటే.. మూవీపై బజ్ అంతకంటే ఎక్కువగా క్రియేట్ అయిపోతోంది. దీన్ని రీచ్ అయేందుకు ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. 

ఇప్పుడు మెగా మూవీకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకను తాను హ్యాండిల్ చేస్తానని రామ్ చరణ్ భార్య ఉపాసన చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ఏర్పాట్లు ఆమె సలహాలు సూచనల మేరకే జరుగుతున్నాయట. గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ లెవెల్ లో ఈ ఫంక్షన్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. గత పదేళ్లలో ఏ ఆడియో వేడక జరగనంత అట్టహాసంగా ఖైదీ పాటల పండుగను నిర్వహించనున్నారని టాక్. దాదాపు ఇండస్ట్రీలోని అందరు దిగ్గజాలతో పాటు.. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఈ వేడుకకు హాజరయ్యేందుకు మాట తీసుకున్నారట. మరోవైపు చిరుతో గతంలో నటించిన హీరోయిన్స్ అందరినీ ఖైదీ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద ఇండస్ట్రీ ఇప్పటివరకూ చూడని గ్రాండ్ ఫంక్షన్ ని.. మెగా డాటర్ ఇన్ లా చూపించబోతోందని టాక్. 

No comments:

Post a Comment