Thursday 24 November 2016

పవన్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటా

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు కోలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఉంది. ఇతడిని తెలుగులోకి తెచ్చేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ.. నితిన్-సమంత నటించిన అఆ ల కోసం తీసుకున్నా.. తర్వాత తప్పుకున్నాడీ కంపోజర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సైన్ చేసిన అనిరుధ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటానని అంటున్నాడు. 

"పవన్ మూవీకి ఇంకా కంపోజింగ్ ప్రారంభించలేదు. అయితే.. నాకు స్టోరీతో పాటు సినిమా గురించి పూర్తి ఐడియా ఉంది. త్వరలో వర్క్ ప్రారంభించనున్నాం. త్రివిక్రమ్ గారితో మాట్లాడి.. ప్రమోషనల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండేలా జాగ్రత్త పడతాను" అని చెప్పాడు అనిరుధ్. 

వైదిస్ కొలవెరి డీ పాటతో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిపోయిన  అనిరుధ్.. తెలుగులో అరంగేట్రం చేసేందుకు చాలానే టైమ్ తీసుకున్నా.. పవర్ స్టార్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించడాన్ని పక్కాగా ఉపయోగించుకునేందుకు సిద్ధమైపోతున్నాడు. 

No comments:

Post a Comment